: రేపు, ఎల్లుండి జమ్మూకాశ్మీర్ లో ఇంటర్నెట్ సర్వీసులు బంద్


రేపు, ఎల్లుండి జమ్మూకాశ్మీర్ లో ఇంటర్నెట్ సర్వీసులను సస్పెండ్ చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్నెట్ సర్వీసును సంఘవిద్రోహ శక్తులు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ నిర్ణయం వెనుక పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అమెరికాలో జరగనున్న ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో కాశ్మీర్ అంశంపై పాక్ ప్రధాని మాట్లాడుతారని ఆ దేశ దౌత్యాధికారి ప్రకటించిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారని, పాక్ ప్రధాని కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తే భారత ప్రభుత్వం గతంలోలా మౌనంగా ఉండే అవకాశం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. తద్వారా స్వదేశంలో అతివాదుల నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకుండా చేసేందుకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News