: సౌదీ అరేబియాపై ఇరాన్ గుస్సా


హజ్ యాత్ర ప్రమాదంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 20 లక్షల మంది యాత్రికులు వస్తుంటే సౌదీ అరేబియా ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేకపోయిందని ఇరాన్ విమర్శించింది. భారీ సంఖ్యలో హజ్ యాత్రకు వస్తారని సౌదీ అరేబియా ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించింది. సౌదీ అరేబియా ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేదా? అని ఇరాన్ నిలదీసింది. కాగా, ఈ ప్రమాదంలో ఇరాన్ కు చెందిన యాత్రికులు సుమారు వంద మంది వరకు మృతి చెందినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

  • Loading...

More Telugu News