: జగన్ దీక్షపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ గుంటూరులో చేపట్టనున్న దీక్షపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం జగన్ దీక్షపై ఆయన మాట్లాడుతూ, 'బస్సులు పగలగొడతాం' అంటే అనుమతిస్తామా? అన్నారు. 'దీక్ష చేసి చచ్చిపోతాం' అంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. జగన్ దీక్షకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని ఆయన తెలిపారు.