: కూకట్ పల్లిలో భవనంపై నుంచి దూకిన యువతి
హైదరాబాదులోని కూకట్ పల్లిలోని ఓ భవనంపై నుంచి ఓ యువతి కిందికి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రైవేటు వసతి గృహంలో ఉంటున్న శిరీష అనే యువతి, వసతి గృహం మూడో అంతస్తు నుంచి కిందికి దూకింది. దీంతో తీవ్ర గాయాలపాలైన శిరీషను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ఏ ప్రాంతానికి చెందినది? ఎందుకు దూకింది? అనే వివరాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, శిరీష ఆత్మహత్యాయత్నం విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.