: మృతుల్లో ఎక్కువ మంది ఇరాన్, ఆఫ్రికా వాసులే!


ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రం మక్కాలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారిలో ఎక్కువ మంది ఇరాన్, ఆఫ్రికా దేశాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. కాగా, మక్కా తొక్కిసలాట మృతుల సంఖ్య క్షణక్షణానికి పెరుగుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 453 మంది మృత్యువాత పడినట్టు తెలిపారు. వారిలో హైదరాబాదులోని ఎల్బీనగర్ కు చెందిన జానిబీ అనే మహిళ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో మరో 500 మంది గాయపడ్డారు. వారందరికీ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News