: ఘనంగా రాధిక కుమార్తె, క్రికెటర్ అభిమన్యు మిథున్ నిశ్చితార్థం
తమిళనాడు రంజీ క్రికెటర్ అభిమన్యు మిథున్ తో సినీ నటి రాధిక కుమార్తె రయానే వివాహ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. రాధిక బ్రిటిష్ భర్త (రిచర్డ్ హార్డీ) ద్వారా జన్మించిన రయానే హార్డీ లండన్ యూనివర్సిటీ పట్టభద్రురాలు, కాగా, అభిమన్యు టీమిండియా తరపున నాలుగు టెస్టులు, ఐదు వన్డేలు ఆడాడు. గత కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న వీరి వివాహానికి రెండు కుటుంబాలు అంగీకారం తెలిపాయి. దీంతో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. రిచర్డ్ హార్డీకి విడాకులిచ్చిన తరువాతే శరత్ కుమార్ ను రాదిక వివాహం చేసుకుంది.