: పెట్టుబడుల కోసం రిజిస్టర్ అయిన సంస్థనే సంప్రదించాలి: ఇన్వెస్టర్లకు సెబీ సూచన
మొబైల్ కు వచ్చే ఎస్ఎంఎస్ లు, సోషల్ మీడియాలో వచ్చే టిప్ లను అనుసరించి ఈక్విటీ మార్కెట్ లో ట్రేడింగ్ చేయాలనుకునే ఇన్వెస్టర్లకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఓ హెచ్చరిక చేసింది. అటువంటి సందేశాలు, టిప్ లను నమ్మవద్దని తెలిపింది. ఈక్విటీ మార్కెట్ లో పెట్టుబడులు, ట్రేడింగ్ కు సెబి వద్ద రిజిస్టర్ అయిన ఇన్వెస్ట్ మెంట్ అడ్వైజర్లు, రీసెర్చ్ విశ్లేషకులను మాత్రమే విశ్వసించాలని సూచించింది. తమ వద్ద రిజిస్టర్ కాకుండా ఇన్వెస్ట్ మెంట్ టిప్ లు అందించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని సెబీ హెచ్చరించింది. ఈక్విటీ పెట్టుబడుల కోసం ఏ సంస్థనైనా సంప్రదించాలనుకుంటే ఆ సంస్థ సెబీ వద్ద రిజస్టర్ అయిందా? లేదా? అన్నది తెలుసుకోవాలని వివరించింది. తమ వద్ద రిజిస్టర్ అయిన సంస్థల పేర్లు సెబి వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నట్టు వెల్లడించింది.