: నదుల అనుసంధానం పూర్తి చేసి చంద్రబాబు చరిత్ర సృష్టించారు: ఉమా భారతి


నదుల అనుసంధానం విషయంలో తామింకా పథకాల రూపకల్పన స్థాయిలోనే ఉన్నామని, కానీ, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం నదుల అనుసంధానాన్ని పూర్తి చేసి చరిత్ర సృష్టించారని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి ప్రశంసించారు. ఈ అంశంపై అప్పుడే తాము చంద్రబాబును అభినందిస్తూ లేఖ రాసినట్టు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం కొద్దిసేపటి కిందట ఉమా భారతితో సమావేశమై చర్చించారు. భేటీ ముగిసిన తరువాత ఉమా మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని హామీ ఇచ్చారని, నిర్ణీత కాలంలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పార్లమెంటులో హామీ ఇచ్చినట్టు పోలవరంకు అన్ని విధాల సహకారం అందిస్తామని ఆమె ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News