: 'నేతన్న'ల ఆశాజ్యోతి జువ్వాడి కన్నుమూత


చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం అహర్నిశలూ కష్టపడ్డ సీనియర్ కాంగ్రెస్ నేత, సిరిసిల్ల తొలి ఎమ్మెల్యే జువ్వాడి నర్సింగరావు ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. హైదరాబాద్, బేగంపేటలోని ఆయన స్వగృహంలో జువ్వాడి కన్నుమూశారని కుటుంబీకులు తెలిపారు. జువ్వాడి 1962లో గుడ్ల లక్ష్మీ నరసయ్యపై, 1972లో చెన్నమనేని రాజేశ్వర్ రావుపై గెలుపొంది ఎమ్మెల్యేగా పనిచేశారు. మూడుసార్లు సిరిసిల్ల సెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శనివారం నాడు ఆయన స్వగ్రామం తంగళ్లపల్లిలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతికి పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం వెలిబుచ్చారు.

  • Loading...

More Telugu News