: మక్కాలో ఏపీ యాత్రికులు 400 మంది క్షేమం: ఏపీ హజ్ కమిటీ ఛైర్మన్
మక్కా మసీదును దర్శించుకునేందుకు వెళ్లిన యాత్రికుల్లో తమ శిబిరంలో ఉన్న 400 మంది తెలుగు యాత్రికులు క్షేమంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ఛైర్మన్ అబిద్ రషీద్ ఖాన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి హజ్ యాత్రకు వెళ్లిన ఇతరుల క్షేమ సమాచారం తెలుసుకుంటున్నామని అన్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల యాత్రికులకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి దిగ్భ్రాంతికర వార్తలు వినలేదని ఆయన చెప్పారు. కాగా, ప్రతి ఏటా పవిత్ర హజ్ యాత్రకు వేలాదిగా ముస్లింలు తరలివెళ్తారు. ఈ ఏడు కూడా భారీ సంఖ్యలోనే వెళ్లారని సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.