: ఇది నాలుగోసారి...బాధగా ఉంది: ఖుష్బూ


ప్రముఖ తమిళ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ కాలికి గాయమైంది. గాయం బాధను కాసేపు పక్కన పెడితే...గతంలో మూడు సార్లు గాయమైన ప్రదేశంలోనే మరోసారి గాయం కావడం ఇంకా బాధిస్తోందని ఖుష్బూ చెప్పింది. 'ప్రస్తుతానికి కాలు ఇలా ఉంద'ని చెబుతూ, బ్యాండేజ్ తో కట్టిన తన కాలు ఫోటోను ఆమె ట్విట్టర్లో పోస్టు చేసింది. అయితే ప్రస్తుతానికి సేఫ్ హ్యాండ్స్ లోనే ఉన్నానని, అపోలో ఆసుపత్రిలో స్పెషలిస్టులు చికిత్స అందిస్తున్నారని చెప్పింది. కాగా, ఖుష్బూకు తమిళనాట విశేషమైన ఆదరణ ఉంది.

  • Loading...

More Telugu News