: విజయవాడలో మంత్రులకు అపార్ట్ మెంట్లు, విల్లాలు... మలేషియన్ టౌన్ షిప్ తో ప్రభుత్వం ఒప్పందం
విజయవాడ నుంచే పూర్తి స్థాయి పరిపాలన కొనసాగించాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కదాన్ని చక్కబెట్టే పనిలో పడింది. అటు ఉద్యోగుల కార్యాలయాల నుంచి, ఇటు మంత్రులకు కూడా నివాస సౌకర్యాన్ని విజయవాడలో కల్పించేందుకు సిద్ధమైంది. తాజాగా అక్కడ మంత్రులకు నివాస గృహాలు ఖరారయ్యాయి. మలేషియన్ టౌన్ షిప్ (రైన్ ట్రీ పార్క్)లో విల్లాలు, అపార్ట్ మెంట్లు అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 245 అపార్ట్ మెంట్లు, 26 విల్లాలు అద్దెకు తీసుకోనున్నారు. నవంబర్ 1వ తేదీలోగా వాటిని తమకు అప్పగించాలని యజమానులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.