: ఆల్టోతో 'ప్రైస్ వార్'కు దిగిన చిన్న కారు ఇదే!


ఫ్రాన్స్ కేంద్రంగా వాహనాలను మార్కెటింగ్ చేస్తున్న రెనాల్ట్ సంస్థ తన సరికొత్త చిన్న కారు 'క్విడ్'ను విడుదల చేసింది. దీని ధర రూ. 2.56 లక్షలని (ఎక్స్ షోరూం, న్యూఢిల్లీ) సంస్థ ప్రకటించడంతో, ఇదే శ్రేణిలో లభిస్తూ, ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతి సుజుకి ఆల్టో కారుకు గట్టి పోటీ ఎదురు కానుందని ఆటో ఇండస్ట్రీ నిపుణులు వ్యాఖ్యానించారు. ఐదు మోడల్స్ లో కార్లను విక్రయిస్తున్నప్పటికీ, 2 శాతం కన్నా తక్కువ మార్కెట్ వాటాను కలిగివున్న రెనాల్ట్ సంస్థ, ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు క్విడ్ ఉపకరిస్తుందని భావిస్తున్నారు. హ్యాచ్ బ్యాక్ కు, ఎస్యూవీకి మధ్య రకంగా కనిపించే క్విడ్ చూడగానే ఆకర్షిస్తుండటం, రెనాల్ట్ కు కలిసొచ్చే అంశం. కాగా, ఆల్టోతో పాటు హ్యుందాయ్ ఇయాన్, టాటా నానో తదితర కార్లతోనూ క్విడ్ పోటీ పడుతుందని అంచనా.

  • Loading...

More Telugu News