: ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేశానన్న వార్తలు అవాస్తవం: ఎమ్మెల్యే చింతమనేని
కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేశానన్న వార్తలు అవాస్తవమని టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఖండించారు. ఆమెపై దాడి చేసినట్టు, అక్రమంగా ఇసుక తరలించినట్టు జేసీ శర్మ కమిటీ ఒక్క మాట చెప్పినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. సరిహద్దు దాటి వచ్చి డ్వాక్రా మహిళలతో ఆరోజు వనజాక్షి గొడవపడిందని, కిందపడ్డ ఆమెను కాపాడేందుకు తాను యత్నించానని చింతమనేని పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు శర్మ కమిటీ చేపట్టిన విచారణకు చింతమనేని, వనజాక్షి హాజరై వాదనలు వినిపించారు.