: తల్లిని కాబోతున్నానంటూ కామ్నా జఠ్మలానీ ఆనందం


అల్లరి నరేష్ తో జతకట్టి, 'కత్తి కాంతారావు', 'బెండు అప్పారావు ఆర్ఎంపీ' వంటి పలు కామెడీ చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ కామ్నా జఠ్మలానీ, తల్లి కాబోతున్నదట. ఈ విషయాన్ని స్వయంగా కామ్నాయే వెల్లడించింది. తానిప్పుడు ఐదు నెలల గర్భవతినని, వచ్చే సంవత్సరం ఆరంభంలో డెలివరీ డేట్ ఇచ్చారని ఆనందంగా వెల్లడించింది. గత సంవత్సరం వ్యాపారవేత్త సూరజ్ నాగపాల్ ను బెంగళూరులో రహస్యంగా వివాహం చేసుకున్న కామ్నా ఆ తరువాత కూడా సినిమాల్లో నటిస్తూనే వుంది. ఆమె నటించిన తాజా చిత్రం 'చంద్రిక' విడుదలకు సిద్ధంగా ఉంది.

  • Loading...

More Telugu News