: ఆ బాలికపై బ్లేడు దాడి అవాస్తవం... తనే కోసుకుని కట్టుకథ చెప్పింది!
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిధిలోని వీఆర్ పురంలో 14 ఏళ్ల బాలికపై బ్లేడుతో ఆగంతుకులు దాడి చేసిన ఘటన ఆశ్చర్యకరమైన మలుపు తిరిగింది. అయితే తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేక, బ్లేడుతో బాలికే కోసుకుందని, ఆగంతుకులు దాడి చేసినట్టు కట్టుకథ అల్లిందని పోలీసులు విచారణలో నిర్ధారించారు. వీఆర్ పురంలో పదో తరగతి చదువుతున్న బాలిక పాఠశాలకు వెళుతుండగా ఇద్దరు యువకులు బ్లేడ్ తో దాడి చేసినట్టు తెలియడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను విచారించారు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు తనను ప్రేమించాలని కొంతకాలంగా వేధిస్తున్నాడని, అతనే దాడి చేసి ఉంటాడని పోలీసులకు చెప్పింది. వివరాల ఆధారంగా యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, ఆమె కట్టుకథ అల్లిన విషయం తెలిసింది. ఇది తెలిసిన పోలీసులు, స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.