: తిరుమలలో బాలయ్య సతీమణి... పుష్కరిణిలో పుణ్యస్నానం
తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన నేడు స్వామివారికి జరిగిన చక్రస్నానాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాలు ముగియనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వర స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చారు. టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా స్వామి వారి చక్రస్నానాన్ని తిలకించారు. అనంతరం ఆమె శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించారు. ఎలాంటి ఆర్బాటం లేకుండా సామాన్య భక్తురాలిగా బ్రహ్మోత్సవాలకు హాజరైన ఆమె స్వామి వారికి జరిగిన చక్రస్నానాన్ని భక్తి ప్రపత్తులతో తిలకించారు.