: మోదీ, షరీఫ్ ల మధ్య భేటీ లేదు: భారత విదేశాంగ శాఖ ప్రకటన
భారత ప్రధాని నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటనలో భాగంగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో భేటీ అయ్యే సమస్యే లేదట. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల కోసం నేటి ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా చేరుకున్నారు. అమెరికా నగరం న్యూయార్క్ లోని వాల్దార్ఫ్ ఆస్టోరియా హోటల్ లో ఆయన బస చేశారు. నేటి సాయంత్రానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా ఇదే హోటల్ లో దిగనున్నారు. దాయాదీ దేశాల ప్రధానులిద్దరూ ఒకే హోటల్ లో బస చేస్తున్న నేపథ్యంలో వీరి మధ్య భేటీ ఉంటుందని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ ఊహాగానాలను కొట్టిపారేస్తూ భారత విదేశాంగ శాఖ ఇద్దరు నేతల మధ్య ఎలాంటి భేటీ లేదని ప్రకటన ప్రకటించింది.