: శ్రీని 'పవర్' మంతనాలు షురూ


బీసీసీఐ అధికార పగ్గాల కోసం బోర్డు మాజీ అధ్యక్షుడు, ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్ యత్నాలను ముమ్మరం చేశారు. నేటి ఉదయం చెన్నైలో తన వర్గంతో భేటీ అయిన ఆయన వెనువెంటనే నాగ్ పూర్ విమానం ఎక్కేశారు. బోర్డుకు గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో ఆయన భేటీ అయ్యారు. బీసీసీఐ చీఫ్ ఎంపికపైనే శ్రీనివాసన్, శరద్ పవార్ తో చర్చిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే బోర్డులో మెజారిటీ సభ్యుల వాటా ఉన్న శ్రీనివాసన్ కు పవార్ మద్దతు లభిస్తే, అధ్యక్ష పదవిని చేజిక్కించుకోవడం ఆయనకు కష్టమేమీ కాదని క్రీడా వర్గాలు అంచనాలేస్తున్నాయి. పవార్ మద్దతు లభిస్తే, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కు చెక్ పెట్టేయవచ్చన్న భావనతోనే శ్రీని వేగంగా పావులు కదుపుతున్నారు.

  • Loading...

More Telugu News