: బాలీవుడ్ నటులు జూహీ చావ్లా, అనిల్ కపూర్ లకు బీఎంసీ నోటీసులు


బాలీవుడ్ నటులు జూహీ చావ్లా, అనిల్ కపూర్, జితేంద్ర, గాయకుడు అమిత్ కుమార్ గంగూలీలకు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు నోటీసులిచ్చారు. దేశ వ్యాప్తంగా డెంగ్యూ కేసులో ఎక్కువవుతుండటంతో పలు నగరాల మునిసిపల్ కార్పొరేషన్లు అప్రమత్తమయ్యాయి. నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్లో తనిఖీలు చేసి అపరిశుభ్రంగా ఉన్న ఇళ్లకు నోటీసులు ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే ముంబై మహానగరంలో పలు ప్రాంతాలను తాజాగా బీఎంసీ అధికారులు తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో వారికి అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో దోమలు పెరిగేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు. అయినా ముంబైలోని జూహు, మలబార్ హిల్ లో వారి ఇళ్ల వద్ద డెంగ్యూ కారక దోమలు వచ్చేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నందువల్లే వాళ్లకు నోటీసులు వచ్చినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News