: గుమ్మడికాయంత అభివృద్ధిలో ఆవగింజంత లోపాలు సహజమే: నన్నపనేని వ్యాఖ్య
టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి విపక్షం వైసీపీ తీరుపై విరుచుకుపడ్డారు. ప్రతి చిన్న విషయంపై విమర్శలు గుప్పించడం మానుకోవాలని ఆమె ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సూచించారు. ఆయినా గుమ్మడికాయంత అభివృద్ధిలో ఆవగింజంత లోపాలు సహజమేనని ఆమె కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. శాంతిభద్రతల అంశం ఆధారంగానే జగన్ గుంటూరు దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారని నన్నపనేని అన్నారు. ప్రతిదానినీ విమర్శించే తీరును మార్చుకోవాలని ఆమె విపక్ష నేతలకు హితవు పలికారు.