: రేపటి నుంచి బ్యాంకులకు మూడు రోజుల పాటు సెలవులు
దేశవ్యాప్తంగా బ్యాంకులు మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ నెల 27 వరకు బ్యాంకుల సేవలు పూర్తిగా స్తంభించనున్నాయి. రేపటి నుంచి వరుస సెలవులు రావడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడనుంది. 24 బక్రీద్ సెలవును ప్రభుత్వం ఇటీవల 25కు మార్చడం, 26న బ్యాంకులకు నాలుగో శనివారం సెలవు కూడా ఈ నెల నుంచే అమల్లోకి రానుంది. ఇక 27న ఆదివారం కావడంతో ఎలాగూ పనిచేసే అవకాశం లేదు. అలా మూడు రోజుల పాటు వచ్చిన సెలవులతో ఖాతాదారులకు ఇబ్బందేనని పలువురు అంటున్నారు. ఒక్కరోజు సెలవు వస్తేనే ఏటీఎంలలో సక్రమంగా డబ్బులు అందక ఖాతాదారులు ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ మూడు రోజులు మరిన్ని ఇబ్బందులో!