: సంజయ్ దత్ ను క్షమించేది లేదు: మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు


ముంబై పేలుళ్ల కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తనకు విధించబడ్డ శిక్షను పూర్తిగా అనుభవించాల్సిందేనని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు తేల్చి చెప్పారు. సంజయ్ దత్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలు ఓ ప్రకటన వెలువరించాయి. తనను క్షమించాలని సంజయ్ పెట్టుకున్న దరఖాస్తును గవర్నర్ తిరస్కరించినట్టు అధికారులు వివరించారు. కాగా, ఈ కేసులో అక్రమ ఆయుధాలను ఉద్దేశపూర్వకంగా కలిగివున్నాడన్న ఆరోపణలు రుజువైన నేపథ్యంలో సంజయ్ కి జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఆయన పెరోల్ పై బయటకు రాగా, మహా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.

  • Loading...

More Telugu News