: దేశంలో అత్యంత ధనవంతుడు తొమ్మిదోసారి కూడా ఆయనే!


వందమంది భారతీయ బిలియనీర్ల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఈసారి కూడా దేశంలో అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీయే నిలిచారు. మొత్తం ఆస్తి విలువ రూ.1,25,222 కోట్లతో అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో దేశంలో అత్యంత ధనవంతుడిగా వరుసగా ఆయన తొమ్మిదోసారి తన స్థానాన్ని దక్కించుకున్నట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ఈ ఏడాదిలో రిలయన్స్ 31 వేల కోట్ల రూపాయల సంపద కోల్పోయినా కూడా టాప్ స్థానంలో నిలవడం విశేషం. రెండో స్థానంలో రూ.1,19,259 కోట్ల సంపదతో సన్ ఫార్మా అధినేత దిలీప్ సింఘ్వీ, మూడో స్థానంలో రూ.1,05,345 కోట్లతో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ ఉన్నారు. ఇక ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు సచిన్, బిన్నీ బన్సల్ వందమంది అత్యంత సంపన్నుల జాబితాలో మొదటిసారి చోటు సంపాదించుకున్నారు. 86వ స్థానంలో వారికి చోటు దక్కింది. వారి ఒక్కొక్కరి సంపద రూ.8613 కోట్లుగా నిర్ధారించారు. భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం 7 శాతం వృద్ధిరేటుతో ముందుకెళుతోందని ఫోర్బ్స్ పేర్కొంది. దేశంలోని వందమంది ధనవంతుల సంపద మాత్రం గతేడాది కాలంగా మార్కెట్ల పతనం, రూపాయి విలువ తగ్గడంతో కొంతమేర కరిగిపోయిందని ఫోర్బ్స్ విశ్లేషించింది.

  • Loading...

More Telugu News