: అమీర్ ఖాన్, సన్నీలియాన్ మధ్య కురిసిన 'లవ్' ట్వీట్లు
బాలీవుడ్ లో మిస్టర్ పర్ ఫెక్షనిస్టుగా పేరున్న అమీర్ ఖాన్ పై హాట్ బ్యూటీ సన్నీ లియాన్ 'లవ్' ట్వీట్లు విసిరింది. "మిమ్మల్ని స్నాప్ డీల్ వ్యాపార ప్రకటనలో చూశాను. యూ స్టిల్ లుక్ హాట్... లవ్ యూ" అని తన ట్విట్టర్ ఖాతాలో మెసేజ్ పెట్టింది. దీన్ని చూసిన అమీర్ ఖాన్ తనదైన శైలిలో స్పందించాడు. కృతజ్ఞతలు చెబుతూనే "నువ్వూ అలాంటిదానివే... లవ్ యూ" అని రిప్లయ్ ఇచ్చాడు. నేడు పొద్దున్నే ఈ 'లవ్' ట్వీట్లు కురవగా, నెటిజన్లు, బాలీవుడ్ అభిమానులు ఈ సరదా సంభాషణను ఎంజాయ్ చేస్తున్నారు.