: ప్రొఫెసర్ మెడకు చుట్టుకున్న 'యువభేరి'!
ప్రత్యేక హోదా సాధన దిశగా, ఆంధ్రా యూనివర్శిటీలో జరిగిన 'యువభేరి' సదస్సుకు హాజరైన ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిని సస్పెండ్ చేయాలని చంద్రబాబు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ సదస్సుకు వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ హాజరై ప్రసంగించిన సంగతి తెలిసిందే. సచివాలయంలో ఈ సదస్సు తీరుపై చర్చించిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు సదస్సుకు హాజరైన ప్రసాదరెడ్డి విషయాన్ని అధికారులు తెలియజేశారు. దీనిపై స్పందించిన గంటా, ఆయన్ను సస్పెండ్ చేయాలని ఆంధ్రా యూనివర్శిటీ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మరీ ఆదేశించారు. దీనిపై ప్రసాద్ రెడ్డి స్పందిస్తూ, ఇది తన హక్కులను కాలరాయడమేనని ఆరోపించారు.