: కేసీఆర్ సర్కారుపై ‘రాములమ్మ’ విసుర్లు... రాజ్యం మారినా హింస ఆగలేదని వ్యాఖ్య


రాములమ్మగా తెలుగు ప్రజల గుండెల్లో స్థానాన్ని పదిలం చేసుకున్న సినీ నటి, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి మరోమారు గళం విప్పారు. తెలంగాణలో అధికారం చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు. రాజ్యం మారినా, హింస మారలేదని దెప్పిపొడిచారు. వరంగల్ ఎన్ కౌంటర్ పై స్పందించిన విజయశాంతి నిన్న ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఎన్ కౌంటర్ పై తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి క్షమాపణ చెప్పడం ద్వారా ఆ ఎన్ కౌంటర్ బూటకమేనని ప్రభుత్వం పరోక్షంగానైనా ఒప్పుకుందని పేర్కొన్నారు. మహిళలను అసభ్య దృష్టితో చూసేవారి కళ్లు పీకేసేందుకంటూ ప్రభుత్వం ‘షీ టీమ్స్’ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. అదే సమయంలో మావోయిస్టు శృతిపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం చేసి, అవయవాలపై యాసిడ్ పోసి పోలీసులు కిరాతకంగా హతమార్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News