: ‘హోదా’పై వారం తర్వాత నిర్ణయం... చంద్రబాబుకు జైట్లీ హామీ


ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీలపై వారం తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. ఈలోగానే పన్ను రాయితీలను ప్రకటిస్తామని కూడా జైట్లీ చెప్పారు. సింగపూర్ పర్యటన ముగించుకుని మొన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నిన్న నీతి ఆయోగ్ భేటీ తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా తనను కలిసిన చంద్రబాబుకు అరుణ్ జైట్లీ పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చారు. నీతి ఆయోగ్ సీఈఓ అరవింద్ పనగారియా ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారని, ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీలపై తుది నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా జైట్లీ చెప్పారు. నీతి ఆయోగ్ నిర్ణయం వెలువడే లోగానే రాష్ట్రానికి పన్ను రాయితీలకు సంబంధించి ప్రకటన చేస్తామని కూడా జైట్లీ చెప్పారు.

  • Loading...

More Telugu News