: శ్రీవారి చక్రస్నానానికి పోటెత్తిన భక్తజనం... నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు


తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తొమ్మిది రోజుల క్రితం ప్రారంభమైన బ్రహ్మోత్సవాలకు భక్త జనం భారీగా తరలివచ్చారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు స్వామివారికి చక్రస్నానంతో ముగుస్తాయి. నేటి ఉదయం స్వామివారికి పుష్కరిణి సమీపంలో మొదలైన చక్రస్నానాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. నేటి సాయంత్రం జరగనున్న ధ్వజావరోహణంతో తిరుమల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

  • Loading...

More Telugu News