: మీరు లేస్తే... మా వాళ్లూ లేవాల్సి వస్తుంది: బీఏసీలో కేసీఆర్, ఎర్రబెల్లి మధ్య వాగ్వాదం


తెలంగాణ శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో భాగంగా నిన్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. తమ పార్టీ సభ్యులు లేచినప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డుకుంటున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. దీనిపై వేగంగా స్పందించిన కేసీఆర్ ‘‘మీ వాళ్లు సక్కగుంటే మా వాళ్లు అడ్డుకోరు. మీ వాళ్లు లేస్తే, మా వాళ్లూ లేవాల్సి వస్తుంది’’ అని బదులిచ్చారట. దీంతో బీఏసీలో ఒక్కసారిగా వేడి రాజుకుంది. అంతేకాక ఎర్రబెల్లి చర్చించాలంటూ ప్రతిపాదించిన పలు అంశాలపై అధికార పక్షం అభ్యంతరం తెలిపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త అంశాలను ప్రస్తావిస్తే, చర్చకు అనుమతించేది లేదని మంత్రి హరీశ్ రావు ఘాటుగానే బదులిచ్చారట.

  • Loading...

More Telugu News