: రహదారి ప్రమాద నివారణకు ఏపీ రవాణా శాఖ కీలక నిర్ణయాలు


రహదారి ప్రమాదాలను నివారించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. రహదారి ప్రమాద నివారణకు కఠినమైన నిబంధనలు అమలు చేయనుంది. ఈ మేరకు ఆర్టీఏ కమిషనర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, తొలిసారి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ లైసెన్సును 3 నెలలు రద్దు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఒక డ్రైవర్ రెండుకు మించి ప్రమాదాలకు కారణమైతే అలాంటి వారి లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేయనున్నామని చెప్పారు. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పరిమితికి మించితే బస్సులు, వాహనాలపై చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ 1 నుంచి ద్విచక్రవాహనదారులు శిరస్త్రాణం తప్పనిసరిగా ధరించాలని ఆయన చెప్పారు. ద్విచక్ర వాహనంతోపాటే శిరస్త్రాణం కూడా అమ్మాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఆర్టీఏ కార్యాలయాల్లో అవినీతి నిరోధానికి మొత్తం ఆన్ లైన్ చేసినట్టు ఆయన చెప్పారు. ఎల్ఎల్ ఆర్, లైసెన్స్, ఫిట్ నెస్ మినహా అన్నీ ఆన్ లైన్ ద్వారానే నిర్ణయిస్తామని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News