: ప్రపంచం మొత్తం భారత్ గురించే మాట్లాడుతోంది: మోదీ
ప్రపంచం మొత్తం భారత్ గురించే మాట్లాడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఐర్లాండ్ లోని డబ్లిన్ లోని ప్రవాస భారతీయులతో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ, ఐర్లాండ్ తో భారత్ సంబంధాలు మరింత పటిష్ఠం కావాలని ఆకాంక్షించారు. ఐర్లాండ్ ప్రధానితో చాలా విషయాలపై చర్చించినట్టు మోదీ తెలిపారు. సారూప్యత ఉన్న అన్ని విషయాల్లోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రవాస భారతీయులు అపూర్వ స్వాగతం పలికారని మోదీ అభినందించారు. బ్రిక్స్ దేశాల్లో భారత్ కీలకంగా మారిందని ఆయన తెలిపారు. అత్యధిక యువశక్తి ఉన్న దేశం భారత్ అని ఆయన చెప్పారు. భారత్ ను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లేది యువతేనని ఆయన అన్నారు. యోగాను భారత్ విశ్వవ్యాప్తం చేసిందని ఆయన తెలిపారు. నేడు భారత్ ఎవరి ముందూ మోకరిల్లాల్సిన పని లేదని ఆయన అభిప్రాయపడ్డారు.