: నాలుగు వేల మంది ఉద్యోగులను తొలగించిన వేదాంత
వేదాంత రిసోర్సెస్ కంపెనీ సుమారు నాలుగు వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వీరందర్నీ ఇంటికి పంపింది. భారత్ లోని చమురు, గ్యాస్, అల్యూమినియం, ముడి ఇనుము, జింక్ తదితర విభాగాల్లో నాలుగు వేల మంది సిబ్బందిని తొలగించింది. ఇందులో 2700 మంది ప్రత్యక్ష ఉద్యోగులు కాగా, ఇతరులు పరోక్షంగా విధులు నిర్వర్తించేవారు. ఇందులో బాల్కోలో వెయ్యి మంది, వేదాంత అల్యూమినియం నుంచి రెండు వేల మంది, సెసా గోవా, కైర్న్ ఇండియా కంపెనీల నుంచి 450 మంది చొప్పున ఉద్యోగులను తొలగించారు.