: యునినార్ పేరు మారింది... ఇకపై టెలినార్!


భారత్ లో ప్రముఖ టెలికాం సంస్థ యునినార్ కంపెనీ టెలినార్ గా పేరు మార్చుకుంది. నార్వేకు చెందిన టెలినార్ కంపెనీ భారత్ లోని యునిటెక్ వైర్ లెస్ సంస్థలో పెట్టుబడులు పెట్టింది. దీంతో ఈ రెండు సంస్థలు యునినార్ పేరుతో వినియోగదారులకు సేవలందించాయి. అయితే మొబైల్ సేవల నుంచి యునిటెక్ వైర్ లెస్ సంస్థ విడిపోయింది. దీంతో ఇకపై భారత్ లో టెలినార్ సంస్థ సేవలందిస్తుందని యునినార్ ప్రకటించింది. ప్రస్తుతం భారత్ లో ఆరు సర్కిళ్లలో యునినార్ సేవలందిస్తోంది. టెలినార్ వస్తూనే కాల్ రీ ఫండ్ పేరుతో కొత్త ఆఫర్ ను ప్రకటించింది. లోకల్ కాల్స్ తో పాటు ఎస్టీడీ, ఐఎస్డీ కాల్స్ కు కూడా కాల్ రీ ఫండ్ వర్తిస్తుందని టెలినార్ తెలిపింది. పేరుతో పాటు ట్యాగ్ లైన్ ను కూడా టెలినార్ మార్చింది. యునినార్ ట్యాగ్ లైన్ 'సబ్ సే సస్తా' కాగా, టెలినార్ ట్యాగ్ లైన్ 'అబ్ లైఫ్ ఫుల్ పైసా వసూల్' గా పేర్కొంది.

  • Loading...

More Telugu News