: వివాదం రేపిన దిగ్విజయ్ ట్వీట్


కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ఓ ట్వీట్ పెనువివాదం రేపింది. సోషల్ మీడియా వేదికగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న నేతలు ట్వీట్లు, కామెంట్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా దిగ్విజయ్ సింగ్ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఫోటోలలో ముఖాలను సగం సగం కత్తిరించి, ఆ రెండు సగాలను కలుపుతూ మత ప్రచారం, మత అభివృద్ధికి పాటుపడే వీరి వల్ల సామాజిక దూరం పెరుగుతోందని వ్యాఖ్యానించారు. ఇది పెను దుమారం రేపింది. ముస్లింల ప్రతినిధిగా చెప్పుకునే ఒవైసీ, హిందువుల ప్రతినిధిగా చెప్పుకునే మోహన్ భగవత్ ఫోటోను కలపడంపై వారి మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒవైసీ ఆ ఫోటోపై మండిపడ్డారు. తన ఫోటోను అలా వాడుకోవడంలో తనకు ఇబ్బందేమీ లేదని, అయితే ముస్లింల మనోభావాలు అగౌరవపరిచారని ఆయన పేర్కొన్నారు. దీనికి దిగ్విజయ్ సమాధానమిస్తూ, తమ పార్టీ అధికారంలో ఉండగా సామాజిక దూరం లేదన్న విషయం గుర్తించాలని ఒవైసీకి చెప్పారు. దీనిపై మండిపడ్డ ఒవైసీ, బాబ్రీ మసీదుపై దాడి ఎవరి హయాంలో జరిగిందని ప్రశ్నించారు. అలాగే బీహార్, అస్సాం వంటి రాష్ట్రాల్లో మసీదుల్లో హిందూ దేవుళ్ల విగ్రహాలు పెట్టలేదా? అని నిలదీశారు. ముస్లింలు, దళితులు విద్య, ఉద్యోగం, నివాసం వంటి రంగాల్లో హక్కులు పొందగలిగినప్పుడే దేశంలో లౌకికవాదం బలపడుతుందని ఒవైసీ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News