: సెల్ఫీలు సరే, మరి దొంగల మాటేంటి?


సెల్ఫీల పిచ్చితో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటుండగా, మరికొంత మంది తమ విలువైన ఫోన్లను పోగొట్టుకుంటున్నారు. సెల్ఫీ మోజులో చుట్టుపక్కల పరిసరాలను, పక్కనే ఏమి జరుగుతుందో కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో సెల్ ఫోన్ యూజర్లు ఉండటంతో వారు తమ ఫోన్లను పోగొట్టుకుంటున్న సంఘటనలు బ్రిటన్ లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఫోన్లను పోగొట్టుకున్న సెల్ ఫోన్ యూజర్లు ఆ దేశంలో కొత్త రకం డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. పోగొట్టుకున్న తమ ఫోన్లకు బీమా చెల్లించాలంటూ బ్రిటన్ బీమా కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు. అజాగ్రత్తగా ఉన్నది కాక, ఇంకా డబ్బులు చెల్లించమంటారా? అంటూ బీమా కంపెనీలు మండిపడుతున్నాయి. పైసా కూడా చెల్లించమని తెగేసి చెబుతున్నాయి. చేతులు బార్లా చాపి సెల్ఫీ తీసుకోకపోతే, సెల్ఫీ స్టిక్ ఒకటి కొనుక్కోవచ్చుగా? అంటూ సలహా కూడా ఇచ్చాయి బీమా కంపెనీలు. సెల్ ఫోన్ యూజర్లు ఈ విషయాన్ని లండన్ లోని ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ అంబుడ్స్ మెన్ సర్వీస్ అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఏమాత్రం ఫలితం లేదట.

  • Loading...

More Telugu News