: ఏపీలో సౌర విద్యుత్ ఫలకాల తయారీ యూనిట్... చైనా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చైనా సంస్థ జియాన్ లాంగి సిలికాన్ మెటీరియల్స్ మధ్య ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై శ్రీసిటీ ప్రైవేట్ లిమిటెడ్, జియాన్ లాంగి మెటీరియల్స్ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో జియాన్ లాంగి సంస్థ సౌర విద్యుత్ ఫలకాల తయారీ యూనిట్ ను ఏపీలో నెలకొల్పనుంది. శ్రీసిటీలోని 60 ఎకరాల్లో రూ.1600 కోట్లతో యూనిట్ ఏర్పాటవుతుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, స్కేల్, స్కిల్, స్పీడ్ నినాదాలతో చైనా ముందుకెళుతోందని ప్రశంసించారు. రెండంకెల వృద్ధి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఏపీలో అపార వనరులున్నాయని, సోలార్ విద్యుత్ పర్యావరణానికి హాని ఉండదని పేర్కొన్నారు.