: సినిమాల కోసం టీవీని వదులుకోను: కపిల్ శర్మ


సినిమాల కోసం టీవీని వదులుకోనని టీవీ సెలబ్రిటీ కపిల్ శర్మ తెలిపాడు. కపిల్ శర్మ ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'కిస్ కిస్ కో ప్యార్ కరూ' సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేఫథ్యంలో సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న కపిల్ ను ఇక బుల్లితెరను వదిలేసినట్టేనా? అని ప్రశ్నించారు. సినిమాల్లోకి అనుకోకుండా వచ్చానని, బుల్లితెరను వీడే ప్రసక్తి లేదని కపిల్ చెప్పాడు. ప్రేక్షకులు తనను కామెడీ యాంగిల్ లో చూడాలనుకుంటున్నారని, రాబోతున్న సినిమా కూడా కామెడీ నేపథ్యంలో రూపొందిందేనని కపిల్ చెప్పాడు. తన టీవీ షో 'కామెడీ విత్ కపిల్' లాగే చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందర్నీ ఆకట్టుకుంటుందని కపిల్ స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News