: అక్టోబర్ 11 నుంచి ‘బిగ్ బాస్ 9’
కలర్స్ టీవీ ప్రసారం చేస్తున్న రియాల్టీ షో ‘బిగ్ బాస్ 9’ అక్టోబర్ 11 నుంచి ప్రసారం కానుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో డబుల్-ట్రిబుల్ అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. దీని గురించిన వివరాలను నిర్వాహకులు గోప్యంగా ఉంచారు. ఈ కార్యక్రమం మొదటి 5 సీజన్లకు సల్మాన్, ఆ తర్వాత సీజన్లకి ఫరాఖాన్ వ్యాఖ్యాతలుగా ఉన్నారు. వచ్చే నెల 11 వతేదీ రాత్రి 9 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి మళ్లీ సల్లూభాయే వ్యాఖ్యాతగా రానున్నారు. ఈ కార్యక్రమం ప్రసారం గురించి సల్మాన్ తన ట్విట్టర్ లో ఇటీవల ప్రస్తావించారు.