: కేజ్రీవాల్ కు ధన్యవాదాలు చెప్పిన సోమనాథ్ భారతి భార్య


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఆ రాష్ట్ర న్యాయశాఖ మాజీ మంత్రి సోమనాథ్ భారతి భార్య లిపికా మిశ్రా ధన్యవాదాలు చెప్పారు. సోమనాథ్ భారతిపై ఆమె గృహహింస, హత్యాయత్నం కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఈ కేసులో ముందస్తు బెయిల్ కు న్యాయస్థానం అంగీకరించకపోవడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ సోమనాథ్ భారతి ఎందుకలా పరుగెత్తున్నారో తనకు అర్థం కావడం లేదని, ఎంత కాలం పరుగెత్తుతారని, పోలీసులకు లొంగిపోవాలని ట్విట్టర్ ద్వారా సూచించారు. దీనిపై స్పందించిన లిపికా మిశ్రా, కేజ్రీవాల్ స్నేహితుడిలా స్పందించలేదని, ముఖ్యమంత్రిలా స్పందించారని అభినందించారు.

  • Loading...

More Telugu News