: ఏపీలో చేపట్టాల్సిన కొత్త విమానయాన ప్రాజెక్టులపై చర్చించాం: అశోక్ గజపతిరాజు


ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుతో భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన తరువాత మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కొత్తగా చేపట్టాల్సిన విమానాశ్రయాలపై చర్చించినట్టు చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులైన విజయవాడలోని గన్నవరం, విజయనగరంలోని భోగాపురం ఎయిర్ పోర్టు, తదితర విమానాశ్రయాల విస్తరణ అంశంపై చర్చించామన్నారు. త్వరలోనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్, డొమిస్టిక్ రంగాల్లో కొత్త సర్వీసుల ప్రతిపాదనపై కూడా చర్చించామని ఆయన తెలిపారు. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు కూడా వివరించారు.

  • Loading...

More Telugu News