: భారత్-పాక్ మధ్య పెద్ద సమస్య కాశ్మీరే... తప్పకుండా పరిష్కరించాలి: నవాజ్ షరీఫ్


భారత్, పాకిస్థాన్ ల మధ్య ప్రధాన సమస్యపై పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీప్ ఈసారి మరింత స్పష్టంగా మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ముఖ్య సమస్య కాశ్మీరేనని పేర్కొన్నారు. పక్కపక్కనే ఉన్న దేశాలను ఈ సమస్య సుదీర్ఘ కాలంగా వేధిస్తోందని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్టు షరీఫ్ అన్నారు. నూయార్కులో జరగనున్న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 70వ సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యేందుకు వెళుతున్న ఆయన బ్రిటన్ లో మీడియాతో మాట్లాడారు. మొత్తం సమస్య కాశ్మీరేనని, తప్పకుండా పరిష్కరించాల్సిన అంశమని చెప్పారు. ఇరు దేశాలు త్వరలోనే దాన్ని పరిష్కరించే దిశగా పనులు ప్రారంభిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని కేవలం అంతర్జాతీయ వేదికలపై చర్చించడమే కాకుండా పాక్, భారత్ ద్వైపాక్షిక వేదికలపై కూడా చర్చించాలని షరఫ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News