: 'కుముదం'పై ఎగసి పడుతున్న నిరసన జ్వాల!


ప్రముఖ తమిళ వారపత్రిక 'కుముదం'పై మహిళలు, నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ పత్రిక తాజా సంచికలో 'అసభ్యంగా ఉన్న లెగ్గింగ్స్, హద్దులు దాటుతున్న యువతులు' అంటూ, కొన్ని ఫోటోలను కవర్ పేజీపై ముద్రించి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో దుమారం చెలరేగింది. ఈ కథనం మహిళలను అవమానిస్తున్నట్టుందని, తక్షణం పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో కుముదం పత్రికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లెగ్గింగ్స్ ధరించిన యువతుల ఫోటోలు తీసి, వారి అనుమతి లేకుండా ఎలా ప్రచురిస్తారని పలువురు ప్రశ్నించారు. చూసే కళ్లలో, మనసులో అసభ్యత ఉంటుంది తప్ప, మహిళల్లో వుండదని కామెంట్స్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News