: మాజీ ప్రియురాలి సంబోధనకి ఉలిక్కిపడ్డ బాలీవుడ్ హీరో!


నిన్నటి వరకు చెట్టాపట్టాలేసుకుని నిజజీవితంలో ప్రేమగీతాలు పాడుకున్న మాజీ ప్రియుడ్ని పట్టుకుని బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఒక్కసారిగా 'బ్రో' (బ్రదర్) అంటూ సంబోధించింది. దాంతో నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపోవడం అది విన్నా వాళ్ల వంతయింది. ఆ వివరాల్లోకి వెళ్తే... మాజీ ప్రియుడు రణ్ బీర్ కపూర్ తో దీపికా పదుకునే 'తమాషా' అనే సినిమాలో జంటగా నటించింది. ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా కేంద్రం ప్రవేశపెట్టనున్న సైబర్ చట్టంపై రణ్ బీర్ కపూర్ అభిప్రాయాన్ని మీడియా అడిగింది. దీనిపై సమాధానమిస్తూ... గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ ఉంటే కనుక వారితో వాట్సప్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో అభ్యంతరకర సంభాషణ చేయకపోవడమే కరెక్టు అన్నాడు. ఈ సమాధానం వినగానే పక్కనే వున్న దీపిక "శభాష్... బ్రో" అంటూ అభినందించింది. దీంతో నిన్నటి ప్రియుడిని 'బ్రదర్' అంటూ సంబోధించిన ఆమె తీరుకి రణ్ బీరే కాదు, మీడియా కూడా అవాక్కైంది. కాగా, ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ కత్రినా కైఫ్ తోనూ, దీపికా పదుకునే రణ్ వీర్ సింగ్ తోనూ పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News