: 'గోమాత'ను జాతీయ జంతువుగా ప్రకటించిన నేపాల్
ఆవును జాతీయ జంతువుగా నేపాల్ ప్రకటించింది. ఆ దేశ కొత్త రాజ్యాంగం అమల్లోకొచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. నేపాల్ జనాభాలో మెజారిటీ స్థానం హిందువులదే. గోమాతను వీరు పరమ పవిత్రంగా పూజిస్తారు. గతంలో నేపాల్ హిందూ దేశంగానే ఉండేది. ఈ క్రమంలో, నేపాలీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కృష్ణ ప్రసాద్ సితౌలా మాట్లాడుతూ, హిందువులకు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ నిర్ణయంతో గోవులకు రాజ్యాంగబద్ధమైన రక్షణ లభిస్తుందని తెలిపారు. గోవధపై నిషేధం ఉంటుందని అన్నారు. కొంత మంది ఎంపీలు ఒంటి కొమ్ము ఖడ్గమృగాన్ని జాతీయ జంతువుగా సూచించినప్పటికీ, దానికి ఆమోదముద్ర పడలేదు.