: మహాకూటమిలోని పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవు: నితీశ్ కుమార్


మహాకూటమిలోని పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకునే అభ్యర్థులను ఎంపిక చేశామని పాట్నాలో విలేకరుల సమావేశంలో తెలిపారు. అభివృద్ధే తమ ఎన్నికల అజెండా అని, బీజేపీ విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్ పై ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన అన్నారు. రాజ్యేంగతర శక్తిగా ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తోందన్న ఆయన, బీజేపీకి సుప్రీంకోర్టులా ఆర్ఎస్ఎస్ మారిందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News