: ముందు ఫ్యాకల్టీ, సదుపాయాలు సమకూర్చుకోండి... తెలంగాణ ఇంజినీరింగ్ కళాశాలలకు హైకోర్టు ఆదేశం
అడ్మిషన్లకు అనుమతివ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వారి పిటిషన్ లపై నేడు విచారణ ముగిసింది. ఫ్యాకల్టీతో పాటు ఇతర సదుపాయాలను ఆరువారాల్లోగా సమకూర్చుకోవాలని సూచించింది. అలా సమకూర్చుకున్న తరువాత మాత్రమే అడ్మిషన్లకు అనుమతి ఇస్తామని తేల్చి చెప్పారు. కళాశాలల్లో సదుపాయాల పరిశీలనకు హైకోర్టు ప్రతినిధితో పాటు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించాలని పేర్కొంది. వారి పరిశీలనలో ప్రమాణాలు లేవని తేలితే కళాశాలల అడ్మిషన్లు రద్దు చేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.