: జియోనీ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర రూ.5,999
పయనీర్ పీ 3 సిరీస్ లో మరో కొత్త మోడల్ అందుబాటులోకి రానుంది. జయోనీ పయనీర్ పీ3ఎన్ పేరుతో విడుదయ్యే ఈ స్మార్ట్ ఫోన్ విలువ రూ.5,999. ఈ మోడల్ ఈ వారంలోనే భారత్ లో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వెల్లడించింది. పయనీర్ 3ఎన్ ఫోన్ ఫీచర్లు..4.5 అంగుళాల స్క్రీన్, 1.3గిగా హెడ్జ్ ప్రాసెసర్, 5 ఎంపీ బ్యాక్ కెమెరా, 0.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా (వీడియో చాటింగ్ కోసం), 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, ఆండ్రాయిడ్ 5.1, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో పాటు డ్యుయల్ సిమ్, 3 జీ సపోర్ట్ చేస్తుంది