: రూ. 60 లక్షల ప్లాటినం ఉంగరాన్ని వెండిదనుకున్న గజదొంగ... కటకటాల్లోకి!


ఎన్నో దొంగతనాలు చేసి దాదాపు రూ. 3 కోట్ల విలువైన బంగారం, ప్లాటినం ఆభరణాలు వజ్రాలు దొంగిలించిన గజదొంగ బోయినశెట్టి దేవేంద్ర పోలీసులకు పట్టుబడ్డాడు. గుంటూరు ఐజీ సంజయ్ తెలిపిన వివరాల ప్రకారం, దోచుకున్న బంగారాన్ని విక్రయించేందుకు మార్కెట్ కు వచ్చిన దేవేంద్రపై అనుమానం వచ్చిన పోలీసులు, అదుపులోకి తీసుకోగా, దొంగతనాల విషయం వెలుగులోకి వచ్చింది. దోచుకున్న సొత్తును దాచిపెట్టిన ఈ దొంగ, రూ. 60 లక్షల విలువ చేసే ప్లాటినం ఉంగరాన్ని, వెండిదిగా భావించి వేలికి పెట్టుకు తిరుగుతున్నాడు. 15వ తేదీన బాపట్ల మండలం చిందుపల్లి గ్రామానికి చెందిన జాస్తి సాంబశివరావు ఇంట్లో దేవేంద్ర దొంగతనం చేశాడని, అక్కడి సొత్తునంతా రికవరీ చేశామని సంజయ్ తెలియజేశారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని, కోర్టు ముందు హాజరు పరచనున్నామని వివరించారు.

  • Loading...

More Telugu News