: ఏపీలో 11,735 అంగన్ వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ లో మహిళా నిరుద్యోగులకు శుభవార్త. అతి త్వరలో 11,735 అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి పీతల సుజాత ఈ మధ్యాహ్నం మీడియాకు తెలిపారు. ఈ పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతుందని ఆమె అన్నారు. ఎటువంటి అవకతవకలు జరిగినా పీడీలదే పూర్తి బాధ్యతని ఆమె హెచ్చరించారు. అంగన్ వాడీ నియామకాల్లో తేడాలు వచ్చినా, లంచాలు తీసుకుని పోస్టులు భర్తీ చేసినట్టు తెలిసినా కఠిన చర్యలు తీసుకుంటామని సుజాత తెలియజేశారు. ఈ పోస్టులను భర్తీ చేసే బాధ్యతలు పీడీలపై నిలిపామని వెల్లడించిన ఆమె, మొత్తం విధానాన్ని కలెక్టర్లు, జిల్లా ఇన్ చార్జ్ మంత్రులు పర్యవేక్షిస్తారని తెలిపారు.